HMDA పరిధిలో ఉన్నటువంటి మెదక్ జిల్లా, తూప్రాన్ డివిజన్ లోని, మనోహారబాద్ మండలం 105 చెరువులకుగాను 77 చెరువులు, తూప్రాన్ మండలంలోని 138 చెరువులకుగాను 93 చెరువుల FTL, బఫర్ పరిధులను నిర్వచిస్తూ గతంలో ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది, అట్టి ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసిన చెరువుల తుది నోటిఫికేషన్ కోసం HMDA వారు జారీచేసిన చెరువు మ్యాప్ ల ఆధారంగా , రెవెన్యు, ఇరిగేషన్ అధికారులు FTL , బఫర్ పరిధులను స్పష్టంగా నిర్వచిస్తూ, అట్టి పరిధిలోకి వస్తున్న పట్టాధారుల వివరాలు నమోదు చేస్తూ సంయుక్త సర్వే చేపట్టినారు. ఇప్పటివరకు తూప్రాన్ మండలములోనీ 23 చెరువుల తుది నోటిఫికేషన్ కోసం సర్వే పూర్తి అవ్వగా, మనోహారబాద్ మండలంలో 22 చెరువుల తుది నోటిఫికేషన్ సర్వే పనులు పూర్తి అయినవి. మిగిలిన చెరువుల సర్వే కూడ త్వరలో పూర్తి చేయుటకు అధికారులు ముమ్మరంగా సర్వే పనులు చేస్తున్నారు. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు సూచనల మేరకు ఇట్టి సర్వే పనులను RDO జయచంద్రరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొంటూ సర్వే పనులలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు సర్వే పనులను సమీక్షిస్తున్నారు .