తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో 6 బెడ్డుల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిని ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆర్డీవో జయ చంద్రా రెడ్డి ప్రకటించారు.
ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహిణుద్దీన్, తూప్రాన్ ఇన్చార్జి తహసీల్దార్ ప్రభుదాస్, డిప్యూటీ DMHO మరియు ఇతర వైద్య అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి అవసరమైన మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు.
భూమి సర్వే నెంబర్ 325 వద్ద కేటాయించబడింది. ఆసుపత్రి నిర్మాణ ఇంజనీర్లు త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుందని తెలియజేశారు. కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయితే, తూప్రాన్ పట్టణంలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయని ప్రజలు ఆశిస్తున్నారు.