contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫుట్ పాత్ అక్రమిస్తే చర్యలు తీసుకుంటాం : తూప్రాన్ మున్సిపల్ కమీషనర్

తూప్రాన్ – మెదక్ : తూప్రాన్ పట్టణంలో దుకాణాల ముందు గల పుట్ పాత్ పై ఎలాంటి వస్తువులు కానీ, దుకాణాలు పెట్టడం దురాక్రమణ గా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ … పూట్ పాత్ నిర్మించింది కేవలం ప్రజలు నడువడానికేనని తెలిపారు. షాప్ యజమానులు ఈ విషయం గమనించి వెంటనే దుకాణం ముందు పెట్టిన వస్తువులను షాప్ లోపల పెట్టుకోవాలని సూచించారు. ఒక వేళ అలాగే వస్తువులు పెట్టితే సీజ్ చేస్తామని  హెచ్చరించారు. అలాగే వ్యాపారులకు ముఖ్య సూచన చేస్తూ ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు . ఈ పై విషయాల పై పోకస్ చేసి స్పెషల్ డ్రైవ్ చేసి షాప్ టూ షాప్ తనిఖీలు చేపడతాం అని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :