మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాప్ లో నకిలీ మందులు అమ్ముతున్నారంటూ ప్రభాకర్ అనే రైతు ఆందోళన చేపట్టారు. గడ్డి మందు తీసుకెళ్లి పొలానికి స్ప్రే చేస్తే నాలుగు ఎకరాల వరి ఎండిపోయి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. షాపు యజమానిని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశాడు.