మెదక్ జిల్లా తూప్రాన్: మంగళవారం నాడు తూప్రాన్ డివిజన్ లో గంజాయి అమ్ముతున్న నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తూప్రాన్ డిఎస్పి వెంకట రెడ్డి మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం .. తూప్రాన్ పట్టణంలోని లక్ష్మీనరసింహ వెంచర్లో ఎండు గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్ సీఐ రంగకృష్ణ ఎస్ఐ శివ నందన్ దాడి నిర్వహించి 300 గ్రాములు ఎండు గంజాయి మూడు సెల్ ఫోన్లు స్వాధనం చేసుకొని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
నలుగురు వ్యక్తులు తూప్రాన్ పట్టణానికి చెందిన నీలం అజయ్, శ్యామగారి లోకేష్, మామిళ్ల తరుణ్, అమిత్ అనే నలుగురు వ్యక్తులను రిమాండ్ కు తరలిస్తామని తూప్రాన్ డిఎస్పి తెలిపారు. అనంతరం చుట్టుపక్కల గ్రామాలలో డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాలు అమ్మినా .. కొన్నా .. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు డిఎస్పీ. మీడియా సమావేశంలో సిఐ రంగ కృష్ణ, తూప్రాన్ ఎస్ఐ శివానందం, కానిస్టేబుల్ సురేష్, కృష్ణ పాల్గొన్నారు.