తూప్రాన్ :తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం తూప్రాన్ మండల కేంద్రంలోని నలంద డిగ్రీ కాలేజీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తపస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, పెండింగ్ మెడికల్ జిపిఎఫ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు అన్నారు.తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ మాట్లాడుతూ పెండింగ్ డిఏ లను ప్రకటించాలని, పి ఆర్ సి ని ప్రకటించి, వెంటనే అమలు చేయాలని,డిసెంబర్ 17 వ తేదీ నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు .సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలలలో ఖాళీ అయిన స్థానాలను ప్రమోషన్ల ద్వారా నింపాలి అని , ప్రభుత్వ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించొద్దని, కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలలో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం,చల్లా లక్ష్మణ్ తపస్ రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్, తపస్ మహిళా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూప రాణి, సుజాత, తుప్రాన్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాను ప్రసాద్, సంతోష్ తపస్ జిల్లా నాయకులు రవీందర్, చక్రవర్తి, వేణు,సుమతి,సంజీవ్, శ్రీకాంత్ రెడ్డి, జ్ఞానేశ్వర్, రాజేశ్వర్, మెట్టు శేఖర్,లక్ష్మీనారాయణ, మల్లేష్, ప్రసాద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరేందర్ గౌడ్, నాగిరెడ్డి, కృష్ణ మూర్తి, ఆంజనేయులు, తులసిరామ్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిద్దు, ఉమ్లా నాయక్, నర్సింలు , నాగిరెడ్డి,ప్రభాకర్, చంద్రయ్య,పోచయ్య, స్వామి, శ్రీనివాస్, కృష్ణ, దుర్గ ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.