మెదక్ జిల్లా తూప్రాన్ : పడాలపల్లి లో అంబేద్కర్ మహిళా సంఘ సభ్యుల డబ్బులను బ్యాంక్ లో జమ చేయకుండా స్వంత ఖర్చులకు వినియోగించుకున్నట్టు సంఘ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళితే గ్రూప్ అధ్యక్షురాలు మినిమల్ భర్త కానుకుంట బిక్షపతి గ్రూప్ సభ్యుల పొదుపు డబ్బులను నెల నెల వసూల్ చేసి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. కానీ ఆ డబ్బు మొత్తాన్ని సుమారు రూ. 6,68,000 రూపాయలు తన స్వంత ఖర్చులకు వాడుకున్నట్టు సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయం పై పోలీసువారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.