సిద్దిపేట: సమాజ అభివృద్ధి లో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారికి అండగా ఉంటామని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట లో జరిగిన TUWJ సిద్దిపేట జిల్లా సమావేశంలో మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు తో కలిసి ఎంపీ మాట్లాడారు. ఎంపీ గా రెండు మార్లు పనిచేస్తున్న సందర్భంలో ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి, మెదక్ సంగారెడ్డి జర్నలిస్టుల తో నాకు ఎంతో అనుబంధం ఉందన్నారు.. నేడు ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టుల సంఖ్య పెరిగిందన్నారు. సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో జర్నలిస్టుల కు మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు..మంత్రిగారి ఆధ్వర్యంలో వారికి త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. మీరు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టి కి తీసుకురావాలని ఆయన కోరారు. జర్నలిస్టుల కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.