తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యుజే- ఐజేయూ) సంగారెడ్డి జిల్లా తృతీయ మహాసభలకు పటాన్ చెరు నియోజకవర్గం నుంచి జర్నలిస్టులు తరలివెళ్లారు. ఈ సభలో నూతనంగా ఎంపిక చేసిన కమిటీలో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యత దక్కింది. జర్నలిస్టుల దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట్ర సభ్యునిగా సీనియర్ జర్నలిస్ట్ బాసిత్ ను నియమిస్తూ టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ప్రకటించారు. టీయూడబ్ల్యుజే సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా రుమాండ్ల అనిల్ కుమార్ (రాజ్ న్యూస్) ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా టీయూడబ్ల్యుజే సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షునిగా శ్రీనాథ్ (సాక్షి), జాయింట్ సెక్రటరీగా చెన్న బసవేశ్వర్ (99టీవీ), ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా పత్తి నర్సింహా (మన తెలంగాణ), శివాజీ ( పీపుల్స్ వార్), రాజు (ప్రజాతంత్ర), ప్రభాకర్ యాదవ్ (తేజ టీవీ), జీవరత్నం (వార్త) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎంపికకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కల్వల మల్లికార్జున రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఫైజల్ ఖాన్, అధ్యక్షులు యాదగిరి , జనరల్ సెక్రటరీ విష్ణు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
