- ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో సతిగూడా జలాశయంలో మునిగి ఇద్దరు గల్లంతు- ఒకరి మృతదేహం స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా : ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో నాటుపడలో చేపలు వేటాడేందుకు ఇద్దరు వ్యక్తులు సతిగుడా జలాశయంలోకి వెళ్లారు. అయితే సతిగుడా జలాశయంలో నీటి ప్రవాహం వల్ల చేపలు వేటాడేందుకు గాను నదిలో ప్రయాణించేందుకు వాడిన నాటు పడవ బోల్తాపడింది. ఈ సంఘటనలో చేపలు వేటకు వెళ్లిన గోవింద్ సర్తార్, తుషా మదిరలు గల్లంతయ్యారు. ఈసంఘటన తెలిసిన వెంటనే ఎన్‌డీఆర్ ఎఫ్ మరియు అగ్నిమాపక బృందాలు రంగలోకి దిగి గాలింపు చర్యలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే మద్యాహ్నం సమయంలో తుట్సా మధిర అనే మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోవింద్ సర్దార్ ఆచూకీ తెలియలేదు. మొత్తం మూడు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నాయని మల్కన్‌గిరి అగ్నిమాపక శాఖ ఇన్‌స్పెక్టర్ సమాచారం అందించారు.