పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆంద్రప్రదేశ్ వర్కింగ్ టు వీలర్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ సమావేశమునకు పల్నాడు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, పిడుగురాళ్ల పట్టణ ప్రెసిడెంట్ తిప్పన బోయిన వెంకట్రావు అద్వర్యం లోపల్నాడు జిల్లాలో మెకనిక్స్ ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రోజు ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువు అయిన టు వీలర్ వెహికిల్ కు ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా అవసరమయ్యేది మెకానిక్స్ అని అలాంటి మెకానిక్ రోజు గడవాలన్నా దయనీయ పరిస్థితి ఉందని ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే సగటు ఈ హెచ్ ఎస్ కార్డు కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు మెకానిక్సన్ గుర్తించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మెకానిక్స్ కు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డు, ఈ హెచ్ఎస్ కార్డు ఏర్పాటు చేయాలి అని మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యలను ఆంద్రప్రదేశ్ టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మ దాయనేని కి మెకానిక్స్ అందరూ విన్నవించుకోవడం జరిగినది. అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మ మాట్లాడుతూప్రతి జిల్లాకి డాక్టర్లను విధిగా ఏర్పాటు చేస్తాం మన యూనియన్ అంతా ఒకటయ్యి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం అన్నారు. 50వేల మందిని ఒక యాప్ లో నెంబర్స్ గా చేర్చుకుంటే అందులో మనసున్న మారాజులు 5000 వేల మంది ఉంటే యాప్ ఓపెన్ చేయగానే పిడుగురాళ్ల వెంకటరావు మేస్త్రి కి ఆరోగ్యం బాగాలేదు అని అడ్రస్సు తో సహా ఆ మెసేజ్ లో ఉంటుంది. మన యూనియన్ నెంబర్స్
మొత్తం తలా రూ.10 రూపాయలు నుండి రూ. 20 రూపాయల వరకు పంపిస్తే సాయంత్రానికల్లా రెండు లక్షల రూపాయలు తయారవుతాయి అతను ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని అన్నారు.ఈ సమస్యను అతి త్వరలోనే గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రతి మెకానిక్స్ కు తగిన న్యాయం చేస్తానని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని స్టేట్ ప్రెసిడెంట్ ధర్మ చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెకానిక్స్ జిల్లా సెక్రటరీ ,శేఖర్ వైస్ ప్రెసిడెంట్ బాషా,బాజి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమాంసా,కన్వీనర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ,గౌరవ అధ్యక్షుడు షేక్ సుభాని, షేక్ హసన్ బాబా,షేక్ జానీ బాషా,మెకానిక్స్ అందరూ పాల్గొన్నారు, ముఖ్య అతిథిగా,స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షాన్వాజ్ పల్నాడు జిల్లా మైనారిటీ నాయకులు ఎండి రజాక్ పాల్గొనడం జరిగినది.