పల్నాడు జిల్లా నరసరావుపేట : పోలీసులు జరిపే వాహన తనిఖీల నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో టూవీలర్లకు, కార్లకు ‘పోలీస్’, ‘ప్రెస్’ అన్న స్టిక్కర్లను తగిలించుకుని తిరుగుతున్న వారిని గుర్తించేందుకు నరసరావుపేట పోలీసులు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించాలని కొందరు కోరుతున్నారు. ఎటు వంటి అక్రిడేషన్, పత్రికా సంస్థల గుర్తింపు కార్డు, పోలీసులమని చెప్పే ఐడీ కార్డు లేకుండా తమ వాహనాలకు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిని రోడ్డుపైనే ఆపి, ఆ స్టిక్కర్లను తొలగించి హెచ్చరికలు ఇవ్వాలని. ఇక అదే వాహనాలకు చలాన్లు ఉంటే, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, గడచిన వారం రోజుల వ్యవధిలో పోలీస్ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్లో కొంత పాత్రికేయుల పేర్లు, పత్రికల పేర్లు చెప్పుకొని బయటపడుతున్నారు. ఇలా తప్పుడు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకోవడం వల్ల అసలు పాత్రికేయులు నకిలీ పాత్రికేయులు ఎవరో తెలుస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా పలువురు సొంతంగా పత్రికా విలేకరినని గుర్తింపు కార్డులను తయారు చేసుకున్నారని పోలీసులు గుర్తించడం గమనార్హం. గతంలో కొందరు యువకులు పాత్రికేయుల పేరుతో అక్రమ సంపాదనకు అలవాటు పడటంతో పోలీస్ లు వారిని అదుపులోకి తీసుకోవటంతో వారి కధ ముగి సింది. కొంతమంది యువత పోలీస్, ప్రెస్, స్టిక్కర్లను అక్రమ పద్దతిలో వినియోగించుకొని మామూళ్లుకు పాల్పడుతున్నారు. సదరు సంస్థ నుండి జారీ చేసిన గుర్తింపు కార్డు గాని లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆక్రెడిషన్ కార్డ్ గానీ కలిగి ఉండాలి. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్, పోలీస్ స్టికర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పద్దతి ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు.