మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ ఎసన్వాయి గ్రామం లో రైతులను పట్టించుకునే నాధుడే లేడు. అఅకాల వర్షాలకు అన్నదాత ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్లముందే నీటిపాలవడం చూసి రైతులు తమ గుండె చెరువు చేసుకుంటున్నారు. కానీ నేటికి అధికారులు గాని , నాయకులు గాని పట్టించుకుపోవడం దారుణమని .. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.