పల్నాడు జిల్లా : మాచర్ల మండలంలో విషాదం. అకాల వర్షం కారణంగా పిడుగుపాటు గురై ఓ వ్యక్తి మృతి చెందటంతో పాటు 30 మేకలు చనిపోయిన
సంఘటన మాచర్ల మండల పరిధిలోని విజయపురి ప్రాంతంలో గల ఎయిర్పోర్ట్ సమీప పంట పొలాల్లో గురువారం జరిగింది. విషయం తెలుసుకున్న సమీప
గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. చనిపోయిన కుమారుడ్ని చూసి తల్లితండ్రులు బోరున విలపించారు.
