ఉత్తర్ ప్రదేశ్‌లో రైలు పట్టాలు తప్పింది. గోండాజిల్లాలో చండీగఢ్, డిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకోగా ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది.
చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్‌కు ట్రైన్ బయలు దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝలాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల దూరంలో రైలు ప్రమాదానికి గురైంది. నాలుగు ఏసీ బోగీలు సహా 10 బోగీలకు పైగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సమాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే సీఎం యోగీ ఆథిత్య నాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
VIDEO | A few bogies of Dibrugarh Express derailed near UP's Gonda railway station earlier today. Details awaited. pic.twitter.com/SfJTfc01Wp
— Press Trust of India (@PTI_News) July 18, 2024