నెల్లూరు జిల్లా: నందవరం ఉన్నత పాఠశాల మరియు నందవరం మోడల్ స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ యుటిఎఫ్ మర్రిపాడు మండల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసారు.యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎస్.కె నాయబ్ నందవరం ఉన్నత పాఠశాలకు ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు.యు ఆర్ ఎస్ ట్రస్ట్ అధినేత జి సురేష్ నందవరం మోడల్ స్కూల్ పాఠశాలకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు
యుటిఎఫ్ మర్రిపాడు ప్రధాన కార్యదర్శి కే సుధాకర్ మాట్లాడుతూ మర్రిపాడు మండలంలోని 10 ఉన్నత పాఠశాలలకు మరియు మోడల్ స్కూల్ కు ఎస్.ఎస్. సి స్టడీ మెటీరియల్ యుటిఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.తదనంతరం స్టడీ మెటీరియల్ ని డొనేషన్ చేసిన సురేష్ ని ఎస్కే నాయబ్ ని పాఠశాల సిబ్బంది మరియు యుటిఎఫ్ మర్రిపాడు మండల శాఖ ఘనంగా సత్కరించారు.