- ఒకే ఒక్క శాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి
- తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ నీరుగార్చింది గత ప్రభుత్వం
- సినిమాటోగ్రఫీ శాఖకు అసలు మంత్రే అవసరం లేదు
- శాఖలో ప్రక్షాళన జరగాలి
- తెలంగాణ సినీ పెద్దలే లేరు
- అంతా అణచివేతకు గురైంది
- ఒకే ఒక్క యూనియన్ స్వయం శక్తి తో ఏర్పడింది – 3 ఏళ్ళ అణచివేత తరువాత – అదే తెలంగాణ మూవీస్ & టివి డబ్బింగ్ యూనియన్ – వ్యవస్థాపక అధ్యక్షురాలు – వి. కవితా ఝాన్సీ
- తెలంగాణ రాక ముందు .. వచ్చిన తరువాత .. డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం కావలనంటే .. లక్ష రూపాయలు చెల్లించాలి
- కానీ కవిత ఝాన్సీ … అటువంటి వారికి ఉచితంగా 200 మంది కి గుర్తింపు కార్డులు ఇచ్చి పని కలిపించడం జరిగింది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్. జాతీయ అధ్యక్షులు, వి.సుధాకర్ విజ్ఞప్తి చేసారు. సియం గారికి ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా అంటూ .. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని మాంత్రం ఎవరైనా సరే విశ్రాంత IAS, డబ్బుకి లొంగని, నీతి నిజాయితీగా , శాఖలో ఉన్న లుసుగులను ప్రక్షాళన చేసే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. గత 40 ఏళ్ళు గా తెలంగాణ బిడ్డలు అణచివేతకు గురయ్యారని, ఎన్నో వేలమంది వీరి అరాచాకాలకు రోడ్డున పడ్డారని తెలిపారు. తెలంగాణ వచ్చినతరువాత కూడా అవమానాలు తగ్గలేదు, విభజన అమలుకాలేదు. తెలంగాణ ఛాంబర్ ఏమైంది ? ఫెడరేషన్ డమ్మీ, కొన్ని యూనియన్లు డమ్మీ, తెలంగాణ యూనియన్లు చెల్లవంటూ.. ప్రచారాలు .. కార్మిక శాఖ పనిచేయదు. పూర్తిగా శాఖను నిర్వీర్యం చేసారు కేసీఆర్ పాలనలో.
తెలంగాణ సినీ & టివి కార్మికుల కోసం ఒంటరి పోరాటం ఒక మహిళా గా ఎంత చేసినా ప్రభుత్వం సహకరించకపోతే ఇక ఏ విధంగా తెలంగాణ బిడ్డలు అభివృద్ధి చెందుతారు? తెలంగాణ బిడ్డలకు అవకాశాలు రానివ్వకుండా అణచివేస్తున్నారు. కొన్ని సందర్భాలలో తెలంగాణ కార్మికుల పై తెలగాణ పోలీసుల బెదిరింపులు. హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు.
తెలంగాణ ఉద్యమకారుడి బిడ్డ కవిత ఝాన్సీ అంధ్రా యూనియన్ల అరాచకాలను సహించలేక 2019 లో తెలంగాణ బిడ్డల కోసం ఒక యూనియన్ అవసరముందని కార్మిక శాఖ అధికారులను సంప్రదిస్తే , దరఖాస్తు పెట్టుకోండి చూద్దామని చెప్పి 3 ఏళ్ళు దాటినా యూనియన్ పొందలేదు. అధికారుల కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. ఈ విషయం నా దృష్టికి వచ్చిన తరువాత ఉన్నత అధికారులులతో మాట్లాడితే అటువంటి ఫైల్ ఇక్కడ లేదని తేల్చి చెప్పడం జరిగింది. మా దర్యాప్తులో సంచలనాత్మకమైన విషయాలు బయటపడ్డాయి. తదుపరి కేవలం ఒక మీడియా పవర్ వలన మాత్రమే కవితా ఝాన్సీ యూనియన్ ఏర్పాటుకు పునాది పడింది.
పెన్నుతో చెప్పలేనివి ఎన్నో సమస్యలు ఉన్నాయి .. అవన్నీ చూస్తుంటే రక్తం మరిగిపోతుంది … తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా అనిపించి. మన మంత్రులు మనకే శతృవులు, మన నాయకులు మనకే శత్రువులుగా ఉండే ఆనాడు … ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ బిడ్డల కన్నీటి గాధ వింటారా … !