contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ నిరుద్యోగుల పై ఫోకస్ పెట్టాలి : వి. సుధాకర్ – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా

తెలంగాణ నేలను ఆంధ్రా పాలకులు ఆక్రమించారని, తెలంగాణ నిధులు, నీళ్లు, భూములను ఆంధ్రా పెత్తందారులు స్వాధీనపరచుకున్నారని, తెలంగాణ ప్రజలను దిగువస్థాయికి అణగదొక్కారని, తెలంగాణ భాషను వెక్కిరించారని, ఉద్యోగాలు కొల్లగొట్టారని, పదవులు ఆంధ్రావాళ్ళే అనుభవించారని, తెలంగాణను 60 ఏండ్లు ఆగం చేసారని కన్నెర్ర చేసింది తెలంగాణ గడ్డ.

వందలాది మంది తెలంగాణ యువత తమ నెత్తురు ధారపోసి ఆంధ్రా పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది. సుమారు 12 వందల మంది బలిదానం వలన తెలంగాణ ఆవిర్భవించింది. నీళ్ళు, నియామకాలు, నిధులు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో యువత కలలు కట్టుకున్న ప్రపంచంలో శూన్యుమే మిగిలింది. ఉద్యోగాలు లేక వయసు మీదపడి, బతుకు భారమై చావలేక బతుకుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎన్నడూలేనంతగా యువతను తాగుబోతులుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. తాగుడుకు బానిసలై మరణించినవారు, మరణిస్తున్న వారు 30 ఏండ్లు లోపువారే. దీనికి ఉదాహరణ హైదరాబాదులో ఉన్న ప్రతి వైన్ షాప్ దగ్గర 25 – 30 ఏండ్ల లోపు యువతనే కనిపిస్తుంది.

రాష్ట్రం ఏర్పడితే వచ్చే ఉద్యోగలపై తెలంగాణ విద్యార్థిలోకం ఎంత ఆశపడి కృంగిపోతుందో మన చదువు, మన కొలువులు మనకే అనే నినాదంపై ఏర్పడిన ప్రభుత్వానికి .. ఆనాడు కళ్ళు కనిపించలేదు. యువత నేడు ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక జీవితం అస్థవ్యస్థంగా మారుతుంది. భారత విద్యా విధానం సాంకేతిక విద్య, వృత్తి విద్యను అందించేదిగా లేదు. సరైన మావన వనరులు కల్పించే, వినియోగించే ప్రణాళికలు లేవు.

అనేక ఆవిష్కరణలను చేయటానికి సిద్ధంగా వున్న దేశ పౌరులను వినియోగించుకోక పోవడం వలన నేటికీ సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారు. అంటే ఉపాధి కల్పించడంలో గత పాలకులు ఎంత నిర్లక్ష్యం వహించారో అర్ధం అవుతున్నది.

రాష్ట్రంలో ఇప్పటికే వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియాలో అనేక మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని ఉద్యోగ వేటలో నిరుద్యోగులుగా మారి జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు.   Center for Monitoring Indian Economy (CMIE) సర్వే ప్రకారం తెలంగాణలో సంవత్సరానికి సరాసరిన 3.88 లక్షల మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. నిరుద్యోగ రేటులో తెలంగాన 8వ స్థానంలో వుంది. పాలకుల అనాలోచిత, అశాస్త్రీయ విధానాల మూలంగా తెలంగాణాలో నిరుద్యోగ రేటు 28.6% నుండి 34.8%కి పెరిగింది. నిరుద్యోగ నిర్మూలనకు ఎన్నో నివేదికలు సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికి అచరణలో శూన్యం.

నిరుద్యోగ నిర్మూలన:-
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే వివిధ రంగాలలో లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. 1. Entertainment, 2. Finance,3. Medical,4. Software,5. Education, 6. Textile,7. Media and news, 8. Food processing, 9. Hospitality, 10. Construction, 11. Advertising, 12. All Govt Sector – State & Central ,13. Defence Force, 14. Call Centre. ఇలా  ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందుగా మన యువతకు కావాల్సిన నైపుణ్యాలను పెంచాలి. నిరుద్యోగుల డేటా ను సేకరించాలి. శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సరిఫికేట్లు ఇవ్వాలి. కార్మిక శాఖలో ప్రతి కంపనీ యొక్క డేటా ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంపెనీ మరియు నిరుద్యోగ యువత డేటా ని కంప్యూటర్లో నమోదు చేయాలి . నిరుపయోగంగా ఉన్న కార్మిక శాఖని వినూత్న రీతిలో కొన్ని మార్పులు జరిపి పునఃప్రారంభించాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :