జమ్మూ కశ్మీర్ లో నిన్న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాను పబ్బల అనిల్ మృతి చెందారు. ఆర్మీలో టెక్నిషియన్ గా పని చేస్తున్న అనిల్ మరణవార్తతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 45 రోజుల సెలవుపై స్వగ్రామానికి వచ్చిన అనిల్ పది రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరారు. ఇంతలోనే ఆయన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
జవాన్ అనిల్ మృతి పట్ల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమన్న సుధాకర్ .. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.