రిపోర్టర్ టీవీ కారంపూడి : కారంపూడి నుండి గురజాల వెళ్ళడానికి ప్రజలు ఆర్టీసీ బస్సు కొరకు నానా అగచాట్లు పడుతున్నారు. పల్నాడు జిల్లా కాకముందు కారంపూడి నుండి గురజాల కు రోజు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేవి ఇప్పుడు పల్నాడు జిల్లా అయ్యాక ఆర్టీసీ బస్సులు కనుమరుగయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి గురజాల వెళ్లాలంటే బస్సులు లేక చుక్కలు చూడవలసి వస్తుంది. కారంపూడి నుండి గురజాల వెళ్లాలంటే ఆటోవాలా బాదుడికి తట్టుకోలేక ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతియా సభ్యుడు వి.శ్యాంప్రసాద్ కి కొందరు ప్రయాణికులు వారి గోడును వినిపించారు. శ్యాంప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ ఆటోవారు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని కారంపూడి నుండి లక్ష్మీపురంకి 9 కిలోమీటర్లు, 30 రూపాయలు తీసుకుంటున్నారు. లక్ష్మీపురం నుంచి గురజాలకు 9 కిలోమీటర్లు, ముప్పై రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని, రెండు స్టేజిలో ఎక్కి దిగి గురజాల వెళ్ళేసరికి సమయం కాస్త వృధా కావడమే కాక ప్రజల పై ఆర్థిక భారం పడుతుందన్నారు. అంతేకాక ప్రయాణికులకు అభద్రతా భావం కూడా ఉంది. గురజాలలో కోర్టు, ఆర్డిఓ ఆఫీస్, డీఎస్పీ ఆఫీస్,, రిజిస్టర్ ఆఫీస్ సబ్ జైలు ఉండటం వలన ప్రతి రోజు వందల మంది ప్రయాణికులు ఏదో ఒక పనిమీద గురజాల వెళ్ళవలసి వస్తుంది. కావున ఆర్టీసీ అధికారులు , జిల్లా కలెక్టర్ , మాచర్ల, గురజాల శాసనసభ్యులు స్పందించి వెంటనే గురజాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలనీ శ్యాంప్రసాద్ కోరారు.