contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి:జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

  • సంచార ప్రదర్శన వాహన్నాన్ని జెండా వూపి ప్రారంభిస్తున్న కలెక్టర్
 గద్వాల:-ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.సోమవారం ఉదయం ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో ఓటరుకు ఓటింగ్ పై  అవగాహనకు ఏర్పాటుచేసిన అవగాహన, సంచార ప్రదర్శన వాహన్నాన్ని , కలెక్టర్  జెండా వూపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమంలో భాగంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో శాసనసభా నియోజకవర్గాల వారీగా  సంచార రథాల (మొబైల్ వాహనాల) ద్వారా గ్రామ గ్రామాన  ప్రతి రోజు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు  తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు అధిక ప్రాధాన్యత వుందని, ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకొనే అవకాశం ఎన్నికల సంఘం కల్పిస్తోందని  తెలిపారు. ఓటు హక్కు నమోదు అయింది, లేనిది గ్రామాల్లో అంగన్వాడి టీచర్లు, పంచాయితి కార్యదర్శులు, గ్రామ రెవెన్యు సహాయకుల  ద్వారా తెలుసుకోవాలని, ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటు హక్కుకు దరఖాస్తు చేయాలని  తెలిపారు. 2023 అక్టోబర్ 01వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన వారంతా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని  అన్నారు. ఈవీఎంల పనితీరుపై అవగాహన కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఐడివోసి, ఆర్ డి ఓ కార్యాలయం లో , నియోజకవర్గ కేంద్రాల తహసిల్ కార్యాలయం లో ఇట్టి అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ గ్రామానికి వేళుతున్నారో ముందు రోజు ఆ గ్రామం లో టామ్ టామ్ ద్వారా తెలపాలని,ప్రజలు ఈ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవడంతో పాటు ఈవీఎం, వివి.ప్యాట్ ల పనితీరుపై అవగాహన, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమములో సూపరిడేంట్ వరలక్ష్మి ,  డిప్యూటి తహశిల్దార్  సత్యనారాయణ , సురేష్  , సూపరిడేంట్ మదన్ మోహన్ , డి పి ఆర్ ఓ చెన్నమ్మ , తదితరులు పాల్గొన్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :