ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామంలో విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నా ఇందిరా అనే మహిళని ఎటువంటి కారణాలు లేకుండా విధులనుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసారు. తను గత 5 సంవత్సారాలు గా వీఏవో గా పనిచేస్తున్నానని కొందరు అధికారులు నామీద కక్ష సాధింపు చర్యతో పిడి పంపినట్లుగా ఒక శీలుడు కవర్ను గిద్దలూరు నుండి నాకు రిజిస్టర్ పోస్ట్ చేశారని చేసారని. ముందస్తు సమాచారం లేకుండా నన్ను విధులు నుండి తొలగిస్తున్నట్టు వచ్చిన లెటర్ అది నిజమా లేక అబద్దమా అని అనుమానంగా ఉందని దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని అంతేకాకుండా రాజకీయ ఒత్తులతోనే తనపై అధికారులు ఇలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంఘంలో జరుగుతున్న అన్యాలను ప్రశ్నించినందుకే తనపై ఇలా కక్ష సాధింపు చర్యలను చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.