డెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో హీరో వరుణ్ నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ ముద్ద నిర్మించారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఘర్షణలో భారత సైనికుల పై జరిగిన దాడి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ సరసన ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ కథానాయికగా నటించింది. రహానీ శర్మ, నవదీప్, అలీరేజా ఎయిర్ ఫోర్స్ అధికారులుగా కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
