శ్రీ వాసవి భజన బృందం సహాయక సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలోని బృందావనంలో భాగవత సప్తాహం, ఏడు రోజుల భజన కార్యక్రమాన్ని నిర్వహించడానికి బెల్లంపల్లి నియోజకవర్గం, మంచిర్యాల పట్టణం కాగజ్ నగర్ పట్టణానికి చెందిన 250 మందితో శనివారం మధురకు వెళ్ళారు .
కాశీ నుంచి కన్యాకుమారి వరకు 108 పుణ్యక్షేత్రాలలో భజనలు భాగవత సప్తాహములు నిర్వహించాలనే ధృడ సంకల్పముతో చిలువేరు దయాకర్ అధ్యక్షతన తణుకు నందయ్య, ఎలుగూరి అంజయ్య, సిద్ధంశెట్టి శ్రీనివాస్ ల నాయకత్వంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 68 ప్రాంతాలలో భాగవత సప్తహములు భజన కార్యక్రమాలను నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని భారతదేశం సుభిక్షంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా అష్టైశ్వర్యాలతో ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉండాలని, జిల్లా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు….