- 25 మందితో నూతన కమిటి నియామకం
- 45మందితో వ్యవస్థాపక కోర్ కమిటి
- 37 సంఘాల ప్రతినిధులూ విడిసి సభ్యులే…
బుగ్గారం / జగిత్యాల జిల్లా:జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా “నక్క చంద్రమౌళి” తో సహా 25 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడున్నర ఏండ్ల క్రితం 45మందితో ఏర్పడ్డ విడిసి వ్యవస్థాపక బృందం మంగళవారం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించింది. బుగ్గారం గ్రామంలోని 25 కుల సంఘాలు, 3 గ్రామైక్య మహిళా సంఘాలు, 7 కార్మిక సంఘాలు, 2 ప్రజాసంఘాలు ఈ గ్రామ అభివృద్ధి కమిటి లో భాగస్వామ్యం వహించాయి. ప్రతి సంఘం నుండి నలుగురు సభ్యులు విడిసి లో పాత్ర పోషించేలా నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక సభ్యులు గా ఉన్న 45మందితో కోర్ కమిటీ ని నియమించారు. ప్రధాన వ్యవస్థాపకుడు చుక్క గంగారెడ్డి ని కోర్ కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోర్ కమిటీ కో- చైర్మన్ లుగా పెద్దనవేని రాగన్న, విలాసాగరపు ఆనందం లను ఎన్నుకున్నారు. మిగతా 42 మంది వ్యవస్థాపకులు కూడా కోర్ కమిటీ సభ్యులు గా కొనసాగుతారు.
బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం
గ్రామాభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షులు గా నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గా పెద్దనవేని రాజేందర్ యాదవ్, కోశాధికారిగా సీగిరి అంజన్న లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గా ముగ్గురు 1. సుంకం ప్రశాంత్, 2. వీరమల్ల సందీప్, 3.మహమ్మద్ అహ్మద్ లను సహాయ కార్యదర్శులుగా ముగ్గురు 1. తిరునగరి విద్యా సాగర్, 2.బోనగిరి రాకేష్, 3. కాశెట్టి మహేష్ లను ఎన్నుకున్నారు. ప్రచార కార్యదర్శులు గా ఇద్దరు 1. కళ్లెం నగేష్ కుమార్, 2. గుర్రాల గంగారాం, సాంస్కృతిక కార్యదర్శిగా నక్క రాజ పోచయ్య లను ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు గా 13మందిని 1. నగునూరి పెద్ద రామన్న గౌడ్, 2. కొడిమ్యాల రాజన్న, 3. జంగ లచ్చన్న, 4.కేతి లచ్చయ్య, 5. బొద్దుల లక్ష్మణ్, 6. కొల్లూరి గంగారెడ్డి (గంగన్న) 7.మసర్ధి నర్సయ్య, 8. ముత్తినేని పోచన్న, 9.జక్కుల బక్కన్న, 10.మసర్ధి రంజిత్, 11.కప్పల మల్లేష్, 12.గొడిశెల చిన్న నారాయణ గౌడ్, 13.మొగిలి లింగన్న లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కోర్ కమిటీ మంగళవారం ప్రకటించింది.