సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద ఓ వాహనం (మహీంద్రా థార్) కలకలం రేపింది. బాలకృష్ణ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నివాసం ఉంటున్నారు. థార్ వాహనం ఆయన ఇంటివైపు వేగంగా దూసుకెళ్లడమే కాకుండా, ఇంటి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ వాహనాన్ని ఓ యువతి నడుపుతున్నట్టు వెల్లడైంది.
ఆ మార్గంలో ఓ అంబులెన్స్ వెళుతుండడంతో, దానికి దారిచ్చేందుకు యువతి తన వాహనాన్ని పక్కకి తీసే క్రమంలో అది రోడ్ డివైడర్ ఎక్కింది. దాంతో ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటివైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.
A Speeding Mahindra Thar rammed into the fence of tollywood actor and MLA Balakrishna's residence at Jubilee Hills. A woman driving the car was tested negative for drunk driving. pic.twitter.com/2jkcb3Izuq
— Qadri Syed Rizwan (@Qadrisyedrizwan) May 17, 2022