మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు, ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు హనుమన్న గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్. మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి. సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ .మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్. హౌస్ల మల్లేష్ పోతిరెడ్డి గణేష్ రాజు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.