మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ శివారులో మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు.