ది రిపోర్టర్ టీవీ:రాజన్న సిరిసిల్ల జిల్లా:23 సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్న ఖైదీని వేములవాడ రూరల్ పోలీసులు పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం రోజున ఒక ప్రకటనలో పేర్కొన్నారు..ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి పర్యవేక్షణలో సి.ఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఏ.ఎస్.ఐ లక్పతి,సిబ్బంది సంపత్, శ్రీనివాస్,ఎల్లగౌడ్, అంజయ్య లతో ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లెకు చెందిన సంద్రగిరి లింగయ్య తండ్రి రాజయ్య,60 సం అనే వ్యక్తి భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ 2000 సంవత్సరం లో పెరోల్ మీద జైలు నుండి వచ్చి 23 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న సంద్రగిరి లింగయ్య ను ఆధునిక సాంకేతికత ఆధారంగా ఉదయం ఎల్లారెడ్డిపేట్ మండలంలో పట్టుకొని వరంగల్ జైలు కి తరలించడం జరిగిందని వెల్లడించారు..
