వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ప్రధానితో విజయసాయిరెడ్డి ఏ అంశాలపై చర్చించారని ప్రశ్నించారు. ఏ-1, ఏ-2 బెయిల్ రద్దు కాకుండాచూడాలని అడిగారా? లేక, బాబాయి హత్య కేసులో అబ్బాయిలను కాపాడాలని కోరారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు, రాజధానికి నిధులు ఇవ్వొద్దని చెప్పారా? విశాఖ స్టీల్ ప్లాంట్ త్వరగా అమ్మేయాలని చెప్పారా? అంటూ అయ్యన్న ప్రశ్నల వర్షం కురిపించారు.