వికారాబాద్: జాతీయస్థాయి కో-కో పోటీలకు వికారాబాద్ జిల్లా దారుర్ మండలం తరిగొపుల గ్రామం హై స్కూల్ విద్యార్థులు ఎంపిక అయ్యారు.ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగిన 1వ సీనియర్,జూనియర్ తెలంగాణ రాష్ట్ర లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో తరిగొపుల పాఠశాల విద్యార్థులు ఫైనల్ మ్యాచ్ వరకు ఉత్తమ ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. విద్యార్థులను స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో నిర్వహించినటువంటి క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనటువంటి
బి. చరణ్ రెడ్డి, వి.వీరేందర్, ఎం.స్వప్నప్రియ, పి.అర్చన లను అభినందించారు. తమ పాఠశాల నుంచి జాతీయస్థాయి కో-కో పోటీలకు విద్యార్థులు ఎంపికైనందున సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు హెచ్.సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. విద్యార్థులను రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పాల్గొనేందుకు కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, జాతీయస్థాయి కో-కో పోటీలకు ఎంపికైనటువంటి విద్యార్థులు ఈనెల 27వ తేదీన రాజస్థాన్లో జరగబోతున్నటువంటి జాతీయ స్థాయి కో-కో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయ బృందం,తన గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.