కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ లో గత నాలుగు రోజుల నుండి గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కార్మిక సిబ్బంది సమ్మెకు ఈరోజు గ్రామపంచాయతీ కార్యదర్శి జయకర్ రెడ్డి మరియు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ హన్మాండ్ల యాదగిరి సంఘీభావం తెలియజేశారు.మల్టీపర్పస్ వర్కర్ల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తున్న జీవో నెంబర్ 51 ని వెంటనే రద్దుపరిచే వీరి డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ కోశాధికారి హన్మాండ్ల యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ ముల్కల అంజయ్య, పంపు ఆపరేటర్లు కట్ట శేఖర్ చుక్కల లక్ష్మయ్య పారిశుద్ధ్య సిబ్బంది కొంకటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
