- జంగంపుట్టు గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలి.!
- కలుషిత నీళ్లు తాగిన రోగుల బారిన పడుతున్నారు
- ఓట్లు మీద ఉన్న ప్రేమ ప్రజాలపై లేదా
అల్లూరి జిల్లా, హుకుంపేట : అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం,గత్తుం పంచాయతీ జంగం పుట్టు గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాగునీటి సౌకర్యం లేక శిథిలావస్థకు చేరిన కుండి నుండి కలుషితనిరు సేకరించి త్రాగుతున్నారు. దీని వల్ల గ్రామస్తులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం పొంచివుంది. ఐనప్పటికీ గత్యంతరం లేక తప్పని పరిస్తితిలో అదే నీటిని తాగుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ 25 గిరిజన కుటుంబాలు జీవన సాగిస్తూ ఉండగా 110 మంది జనాభా కలిగి ఉంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కుండీ లోని నీరు ఇంకిపోవడంతో గ్రామస్తులకు పూర్తి స్థాయిలో నీరు అందటం లేదని ప్రజలు అన్నారు. గ్రామనికి ప్రభుత్వం తరపున తాగునీరు సౌకర్యం కల్పించాక పోవడంతో, గతంలో సాయి రాం సేవా ట్రస్టు ద్వారా నిర్మించిన కుండీ మరమ్మత్తులకు గురై పోయిందిని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి జంగంపుట్టు గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతూన్నరు.