పల్నాడు జిల్లా, వినుకొండ: అష్టవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. గురువారం వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి టౌన్ సిఐ సాంబశివరావు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీ 8 గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని పెద్ద మసీదు బజారుకు చెందిన షేక్ రషీద్ ను అదే బజారుకు చెందిన షేక్ జిలాని స్థానిక ముళ్ళమూరు బస్టాండులో కత్తితో నరికి హత్య చేశాడని ముద్దాయిని అదుపులోకి తీసుకొని ఈనెల 18వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. రషీద్ హత్యలో జిలాని తోపాటు మరో ఆరు మంది ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. నరసరావుపేట బరంపేటకు పఠాన్ అబు బరక్ సిద్ధిక్ ఎలియాస్ సిద్దు, వినుకొండ పట్టణం సీతయ్య నగర్ కు చెందిన కొమ్ము వెంకట సాయి, నిమ్మల బాయి బజారు చెందిన కొమ్ము ఏడుకొండలు, బయలబోయిన అనిల్, ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన పనపర్తి సుమంత్, వినుకొండ పట్టణం ఇస్లాం పేటకు చెందిన షేక్ రోహిత్ ఎలియాస్ సోహెల్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు.