పల్నాడు జిల్లా: వినుకొండ పట్టణంలోని 19వ వార్డులోని కుమ్మరి బజార్లో రోజు కురుస్తున్న వర్షం దాటికి ఉదయం 6 గంటల సమయంలో ఇల్లు కూలి ఇద్దరకు గాయాలు అయిన సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు కాంతం అందించిన సమాచారం మేరకు ఇంట్లో తన కొడుకు ఉపేంద్ర బయట నిద్రిస్తుండగా తన భర్త భాస్కర్ రెడ్డి,అత్తయ్య వీరమ్మ,కాంతం , ఇంట్లో నిద్రించామని కాంతం ఉదయం ఆరు గంటలకి వాకిలి పని నిమిత్తం బయటకు రాగా హఠాత్తుగా ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలడంతో ఇద్దరికీ గాయాలు అయినా సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరినీ హాస్పిటల్ కి తరలించడం జరిగిందని బాధితురాలు చెప్పింది.