contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆస్ట్రేలియా వ‌ర్కింగ్ వీసాకు భారీ స్పంద‌న‌.. 1000 వీసాల‌కు 40వేల మంది ద‌ర‌ఖాస్తు

ఆస్ట్రేలియా ఇటీవల ప్ర‌క‌టించిన వ‌ర్కింగ్ హాలిడే మేక‌ర్‌ వీసా కార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో అందుబాటులో ఉంచిన 1000 వీసాల‌కు రెండు వారాల్లోనే 40వేల మంది భార‌తీయులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఈ మేర‌కు ఆస్ట్రేలియా వ‌ల‌స‌ల శాఖ స‌హాయ‌మంత్రి ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. ఇక ఈ వీసా పొందిన‌వారు ఆ దేశంలో 12 నెల‌ల పాటు స్టే చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆ స‌మ‌యంలో వీసాదారుల‌ను చ‌దువుకోవ‌డానికి, ఉద్యోగం చేయ‌డానికి, నివాసం ఉండ‌డానికి అనుమ‌తించ‌డం జ‌రుగుతుంది.

వీసా ల‌భించిన వారు 2025 ప్రారంభంలో ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చు. 18-30 ఏళ్ల వ‌య‌సు ఉన్న భార‌తీయులు ఈ వ‌ర్కింగ్ హాలిడే మేక‌ర్ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :