స్థానిక మర్రిపాడు గ్రామంలోని ఎస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో మండల నూతన కార్యవర్గ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము విశ్వబ్రాహ్మణ నూతన అధ్యక్షులు కోడూరు బ్రహ్మయ్య ఆచారి ఆధ్వర్యంలోజరిగినది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు రాష్ట్రంలో చేతివృత్తులు నశించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసి పారిశ్రామికంగా ఆదుకోవాలని చేతి వృత్తుదారులను కూడా ప్రత్యేకంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తదుపరి మర్రిపాడు మండలం నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తల్లం సురేష్ ఆచారి, వేములూరి రఘురామయ్య,ఆచారి ఎన్నికపాటి మోహన ఆచారి, పెరుంగాఊరు మదన్ మోహన్ ఆచారి, మర్రిపాడు జిల్లా గౌరవాధ్యక్షులు రెడ్డిచర్ల రత్నం ఆచారి, అధ్యక్షులు కోడూరు బ్రహ్మయ్య ఆచారి, ఉపాధ్యక్షులు భీమవరం చెంచయ్య ఆచారి, మాగంటి అశోక్ ఆచారి, మరియు మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.