కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను వివేకానంద ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, ఎమ్మార్వో బిక్షపతి వివేకానందునికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది, అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలైన ఐదుగురికి బొడ్డు సునీల్ 3500 రూపాయల నగదు విజేతలకు అందజేశారు, ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు తిప్పర్తి ప్రవీణ్, పుల్లెల లక్ష్మణ్,న్యాత సుధాకర్,అనంతరెడ్డి,కటకం తిరుపతి,దుడ్డు మల్లేశం, బూర వెంకటేష్,దేశరాజ అనిల్, ముడికె అజయ్,కాంతాల అంజిరెడ్డి, మీసాల ప్రభాకర్ లు పాల్గొన్నారు.
