విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం సాయిరాం నగర్ 67వ వార్డులో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆవరణంలో ఈ రోజు ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు కూర్మమ్మ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.
వెండితెరపై జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గాజువాక జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెదగంట్యాడ మండలం ప్రభుత్వ వైద్యాధికారిణి శ్రీమతి డాక్టర్ పి హేమలత గారు మరియు స్వామి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో స్వామి విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ మరియు భారత స్కౌట్స్ మరియు గైడ్స్ విశాఖపట్నం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ పి లక్ష్మణ స్వామి గారు సభకు అధ్యక్షత వహించారు.
ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీ తుంపాల శ్రీరామ్ మూర్తి గారు, వివిధ జాతీయ నాయకులకు మరియు భారత రాజ్యాంగం నిర్మాణంలో భాగస్వాములైన ప్రతినిధులకు, ముఖ్యంగా డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారికి పుష్పమాలలు సమర్పించారు.
ఈ వేడుకల్లో బిజెపి సీనియర్ నాయకుడు శ్రీ బాట శ్రీనివాసరావు గారు దేశభక్తి గీతాలాపన చేసి విద్యార్థులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా, స్కౌట్ టైట్, ఫ్లాగ్ ఫోల్, షూ స్టాండ్, క్లాత్ రోప్ స్టాండ్, తూగేడు బల్ల, సోఫా, వంట పాత్రలు భద్రపరుచుకునే స్టాండ్ వంటి ఎగ్జిబిషన్లను పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక పట్టణం కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపిఎం) జూన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం రాంబాబు గారు, బిజెపి గాజువాక జోన్ అధ్యక్షుడు గుటూరు శంకర్రావు మరియు విశ్రాంతి ఉద్యోగ సంఘ నాయకులు కే పి కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకలు పాఠశాల ఇంచార్జ్ జీ పద్మజా పూర్ణ ఆధ్వర్యంలో జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు ఏ లక్ష్మి, మోహన్, అరుణ, జి లక్ష్మి , గైడ్ టీచర్ టి సూర్య కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.