contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

25వేల కిలోల డ్ర‌గ్స్ సీజ్‌.. ఉలిక్కిప‌డిన విశాఖ‌

విశాఖ డ్రగ్స్‌ కంటైనర్స్‌ వెనుక పొలిటికల్‌ లింక్‌లు. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న కంపెనీతో రాజకీయ సంబంధాలు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో రెండు కీలక పార్టీలకు చెందిన నేతలకు లింక్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ లింక్‌లతో తూర్పుగోదావరి జిల్లాలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాకినాడ యూ.కొత్తపల్లి మూలపేటలో హేచరీస్‌లో కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ అధికారులు.

మొత్తం ఏడుగురు అధికారుల బృందంతో తనిఖీ చేస్తున్న సీబీఐ అధికారులు. బ్రెజిల్‌ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్ పోల్‌ అధికారుల సమాచారంతో విశాఖకు చేరుకున్న ఢిల్లీ సీబీఐ అధికారులు, విశాఖ సీబీఐ అధికారులతో కలిసి..డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ సామగ్రి, పలువులు నిపణులతో సీబీఐ అధికారులు వచ్చి.. అక్కడ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.ఆపరేషన్ గరుడలో భాగంగా ఆ 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్‌ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఓ ప్రైవేటు కంపెనీ 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో అధికారులు ఈ కేసులో దూకుడు పెంచారు. జనవరి 14 న బ్రెజిల్ నుండి కoటైనర్ బయల్దేరింది. అక్కడ నుంచి డ్రైడ్‌ ఈస్ట్‌ ఆర్డర్‌ చేసిన విశాఖ కు చెందిన సంధ్య మెరైన్‌ ఆక్వా కంపెనీ యజామాన్యం. బ్రెజిల్‌ లోని ఐసీసీబీ కంపెనీ ద్వారా ఎగుమతైన డ్రైడ్‌ ఈస్ట్.
చెప్పిన సమయం కంటే చాలా ఆలస్యంగా విశాఖ టెర్మినల్‌ కు చేరుకున్న షిప్‌.

ముందుగానే సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు అనుమానిత డ్రగ్స్‌ కంటైనర్‌ ను మార్చి 18న స్వాధీనం చేసుకున్నారు. రొయ్యల మేత కోసం డ్రైడ్‌ ఈస్ట్‌ ను బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న సంధ్య ఆక్వా కంపెనీ. ఇండియాలో డ్రైడ్‌ ఈస్ట్‌ కేజీ ధర రూ. 200 కాగా, బ్రెజిల్‌ లో రూ. 70 కే వస్తుండడంతో బ్రెజిల్‌ నుంచి ఇంపోర్ట్‌ చేసుకుంటున్నట్లు కంపెనీ యజామాన్యం తెలిపింది. ఇదే మా మొదటి ఆర్డర్ అని పేర్కొంటున్న కంపెనీ.

మా కంపెనీ జెన్యూన్‌… అన్ని డాక్యుమెంట్స్‌ ఉన్నాయి. మేం ఎలాంటి విచారణకైనా సిద్దమని కంపెనీ యజమాన్యం వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వారు తెలిపారు. ఈ కేసుని స్వీకరించడానికి మేము సిద్దంగా ఉన్నామని కంపెనీ యజమాన్యం తెలిపింది.

బ్రెజిల్‌ నుంచి విశాఖకు మిరియాల పేరుతో డ్రైడ్‌ ఈస్ట్‌ లో డ్రగ్ రవాణా చేస్తున్న స్మగ్లర్లు. ఆపరేషన్ గరుడ పేరుతో గుఢాచారులు ఇచ్చిన సమాచారం తో ఆపరేషన్ సక్సెస్ చేసిన సీబీఐ.. ఇదీ ప్రపంచం లో నే రికార్డ్ స్థాయిలో అక్రమ రవాణా అంటున్నా నిఘా వర్గాలు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :