భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు హైస్కూల్ రోడ్డును కలుపుతూ 5 కిలోమీటర్ల ర్యాలీ… జీవీఎంసీ 67వ వార్డు సాయిరాం నగర్, గాజువాక, విశాఖపట్నం లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ లో ఆజాద్గా అమృత మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా స్వామి విద్యానికేతన్ స్కూల్ నుండి 5 కిలోమీటర్లు ర్యాలీని 67వ వార్డు కార్పొరేటర్ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. స్కూల్ ఆవరణంలో ఘనంగా వివిధ కార్యక్రమాలు ప్రారంభమైనాయి మొదటగా స్కూల్ కరెస్పాండెంట్ పీ దేవి గారు గాంధీజీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.లక్ష్మణ స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సభలో స్కౌట్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీ ఎస్వీ రమణ గారు మాట్లాడుతూ గాంధీ గారు సత్యం,అహింస అనే వాటిని ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్రం సాధించారని చెప్పారు జాతీయ పతాకాలు ధరించి, జాతీయ జెండాలు పట్టుకొని స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తిస్తూ గాంధీజీ చిత్రపటం పట్టుకొని విద్యార్థులంతా భారత్ మాతాకీ జై, అంటూ అయామ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్, వన్ ఫ్లాగ్ – వన్ లాండ్, వన్ హార్ట్ – వన్ హ్యాండ్ అంటూ కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు హై స్కూల్ రోడ్డు మీదుగా శంకర నగర్, సాయిరాం నగర్, మారుతి నగర్ అశోక్ నగర్ కలుపుతూ ర్యాలీని ఐదు కిలోమీటర్ల పాటు దూరం కొనసాగింది.. ఈ ర్యాలీలో సుమారు 42 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు 20 మంది కబ్స్ అండ్ బుల్బుల్స్ , స్కౌట్ టీచర్లు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డి.లక్ష్మణ్ రావు గారు, ఇన్చార్జ్ పద్మావతి గారు, గైడ్ టీచర్ సూర్య కుమారి గారు, లక్ష్మీ గారు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ ఎస్వీ రమణ గారు పర్యవేక్షణలో జరిగినట్లు స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు తెలిపారు ముగింపు సభలో ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి గారు మాట్లాడుతూ గాంధీజీ ఆశ సాధనకు మనమందరము కృషి చేయాలని కోరారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం సభను జాతీయగీతంతో ముగించారు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి స్కూల్ పిల్లలు తల్లిదండ్రులకు స్కూల్ మేనేజ్మెంట్ మిఠాయిలను పంచిపెట్టారు.