రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఇంటూరి నాగేశ్వరరావు లు ఈరోజు విజయవాడ జక్కంపూడి లోని వరద బాధితుల ఇళ్ళకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నేతలు మీడియా ముఖంగా మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ పునరుద్దరణ పనులు పరిశీలించి
ఇవాళ సాయంత్రానికి కాలనీలో అన్ని బ్లాకులకు విద్యుత్ సరఫరా చేస్తాం అని చెప్పారు.
బాధితులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు,కాలనీ మొత్తం శానిటేషన్, ఇంకా
పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, బైక్ లకు ఆయా కంపెనీలతో మాట్లాడి ఉచితంగా రిపేరు చేయిస్తాం అని హామీ ఇచ్చారు.
యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండి పూడ్చి వరదను అరికట్టి, వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు.