contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తోటపల్లి కాలువ నిర్మాణానికి రైతుల వినతి, ఎమ్మెల్యే బేబీనాయన చర్య

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో రైతుల మధ్య సాగునీటి సమస్యలకు పరిష్కారంగా తోటపల్లి కాలువ నిర్మాణం పై చర్చలు సాగాయి. సింగిరెడ్డివలస రెవిన్యూ పరిధిలో ఈ కాలువ నిర్మాణం ద్వారా సతివాడ, నెమలాం, సింగిరెడ్డివలస, బూరిపేట, అప్పలంపేట గ్రామాలకు సుమారు 1500 – 2000 ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం కల్పించవచ్చని రైతులు ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకువెళ్లారు.

రైతుల సమస్యను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన వెంటనే స్పందించి, సంబంధిత అధికారులను పిలిపించి ఆ ప్రాంతాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం, ఇరిగేషన్ మంత్రికి తోటపల్లి కాలువ నిర్మాణ ఆవశ్యకతను వివరించి, వీలైనంత త్వరగా మంజూరు చేసేలా ప్రయత్నిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, ఎంపీపీ మరియు ZPTC ప్రతినిధి నర్సుపల్లి వెంకటేష్, సింగిరెడ్డివలస సర్పంచ్ ప్రతినిధి భాస్కరరావు, ఇరిగేషన్ శాఖ ఏఈ, ఎమ్మార్వో , మండల సర్వేయర్, వీఆర్వో, చుట్టుపక్కల గ్రామాల రైతులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :