contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి .. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం శనివారం పక్కి గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శ్రీ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు  ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

ఈ సందర్భంగా, ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. “ఎన్టీఆర్ అమర్ రహే” అంటూ నినాదాలు చేస్తూ, ఆయన కుటుంబం, అభిమానుల అభిమానం మరింత పెరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్థానికులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు ఘనంగా పాల్గొని, ఎన్టీఆర్ స్థాయిలో ప్రజల సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :