విజయనగరం జిల్లా : రామభద్రపురం మండల కేంద్రంలో గల దివ్యాంగుల భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మండల విద్యాశాఖధికారులు తిరుమల ప్రసాద్, పెంటయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, వసతులు,సౌకర్యాలు, రాయితీలు కలిస్తుందని భవిత కేంద్రంలో ప్రత్యేక విద్య,ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ నిర్వహిస్తూ అవసరమైన వారికి ఉపకరణాలు ఇస్తూ రవాణా, సహాయకుల, స్టైఫండ్ వంటి భత్యాలు అందిస్తుందని వీటిని దివ్యాంగ్యులందరూ సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు అనంతరం దివ్యాంగులు,వారి తల్లిదండ్రులు కలిసి అవగాహనా ర్యాలీ నిర్వహించి వివిధ క్రీడలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ చింతల రాజేశ్వరి, తేజస్విని స్పెషల్ ఎడ్యుకేటర్ కళావతి,దివ్యాంగుల విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/Delhi-Assembly-Election-2025-_-46.55-Voter-Turnout-Recorded-Till-3-PM.webp)