విజయనగరం జిల్లా, బొబ్బిలి : అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ సిపిఎం నాయకు నిరసన తెలిపారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. శంకరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం 75 వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చల్లో అంబేద్కర్ ని అవమానకరంగా అమిత్ షా మాట్లాడటం తీవ్రంగా ప్రజలందరూ ఖండించాలని, తక్షణమే అమిత్ షాను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కోసం మాట్లాడేటప్పుడు అంబేద్కర్ పేరు స్మరించకుండా ఏ ఒక్కరూ మాట్లాడ్డం సాధ్యం కాదని అన్నారు. పచ్చి మతోన్మాది, మనువాద సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న అమిత్ షా లాంటి వ్యక్తి భారత హోమ్ మినిస్టర్ గా పనికిరాడని అన్నారు. మనువాద సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మద్దతిస్తున్న టిడిపి, వైసిపి పార్టీలు దళితులు గిరిజనులు వైపు ఉంటారా బిజెపి వైపు ఉంటారా ఆలోచించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు బలస శ్రీను సిపిఎం పార్టీ పట్టణ సభ్యులు జి. గౌరేష్ ఏడుకొండలు కార్మికులు పాల్గొన్నారు.