విజయనగరం జిల్లా : నూతన సంవత్సర వేడుకలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలనీ. వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించ రాదన్నారు. రాత్రి 1.00 గంట తర్వాత రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.