విజయనగరం: బాడింగి మండలంలో నేడు గ్రంథాలయ 57వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పిల్లల్లో చదువుకునే ఆలోచనను పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని మండల ఎంపీడీవో రామకృష్ణ తన అమూల్యమైన సందేశం ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “ప్రతి పిల్లలలో చదువు అభిమానం ఉండాలి. చొక్కా ఏసుకుపోయిన పర్వాలేదు, కానీ మంచి పుస్తకం కొనుక్కోవడం ఎంతో ముఖ్యం,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యా ప్రాధాన్యతను తెలియజేసేందుకు మరియు పఠనాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన కల్పించారు. విద్యార్థుల అభివృద్ధికి పుస్తకాలు ఎంత అవసరమో అందరికీ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బాడింగి మండల ఎమ్మార్వో సుధాకర్ , మండల ఎంపీడీవో రామకృష్ణ , ఓ ఆర్ డి సూర్యనారాయణ, ఎస్ఐ తార్కేశ్వరరావు , జిల్లా పరిషత్ ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమారి, గ్రంథాలయం ఇంచార్జ్ శివప్రసాద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.