విజయనగర్ జిల్లా దత్తజేరు : ది రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు. విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం పెద్దమానాపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు , ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఈ రహదారిలో నిర్మించిన సర్వీస్ రోడ్ గుంతలతో ఉండటంతో వాహనాలు ఒక వైపుకు ఒరిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ది రిపోర్టర్ టివి కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు ఈరోజు తాత్కాలిక మరమత్తులు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చదును చేశారు. దీనివలన వాహనదారులకు కొంత ఊరట లభించింది. ప్రజా సమస్యల పై స్పందిస్తున్న రిపోర్టర్ టీవీ కి ప్రజలు కృతఙ్ఞతలు తెలిపారు.