- ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులగా గుర్తించాలి.
- 6వ రోజు సమ్మెకు మద్దతు తెలిపిన దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.
మంచిర్యాల జిల్లా: నేన్నెల, కన్నెపల్లి మండల కేంద్రంల్లోని ఐకెపి వివోఏల ఉద్యోగులు నిరవధిక సమ్మె శిభిరాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివోఏల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణం.ఈ రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యే లకు జీతాలు పెంచిన ప్రభుత్వం. వీవోఏలకు జీతాలు ఎందుకు పెంచడం లేదో అర్థం కావడం లేదు.ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలి. వీవోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం చెల్లించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ సమ్మెకు మద్దతు తెలిపినపశు మిత్ర వర్కర్స్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు సరిత, ఐకేపీ వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.